అర్హులకు విద్యాదీవెన అందేలా చర్యలు చేపట్టాలి
ABN, First Publish Date - 2022-12-16T00:01:03+05:30
అర్హులైన విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికా రి జాకీర్‌హుస్సేన సూచించారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 15: అర్హులైన విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికా రి జాకీర్‌హుస్సేన సూచించారు. గురువా రం మదనపల్లెలో ఏఎస్‌డబ్ల్యూవో కార్యా లయంలో ఆయన వార్డెన్లతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొంత మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లకు ఆధా ర్ అనుసం ధానం కాకపోవడంత జేవీడీ సొమ్ములు జమకావడం లేదన్నారు. దీనిపై దృష్టి పెట్టి ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింకు చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందరికి చలికాలం దుప్పట్లు ఉన్నాయా..కిటికీలు, తలుపుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఏఎస్‌డబ్ల్యూవో శ్రీరాములు, వార్డెన్లు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:01:06+05:30 IST