సమయపాలన పాటించకుంటే చర్యలు
ABN, First Publish Date - 2022-03-06T04:50:30+05:30
అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని సీడీపీవో సునంద హెచ్చరించారు.
బీకోడూరు, మార్చి 5 :అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని సీడీపీవో సునంద హెచ్చరించారు. మండల పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో అంకనగొడుగునూరు, మరాఠిపల్లి అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని అన్ని సెంటర్లలో లబ్ధిదారుకు అందాల్సిన వస్తువులు వారికి అంద డం లేదని ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేశామన్నారు. మండల వ్యాప్తం గా 26 అంగన్‌వాడీ కేంద్రాలు, 8 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటిని కూడా తప్పకుండా తనిఖీ చేస్తానని ఆమె తెలిపారు.
అంగన్వాడీ విద్యార్థులకు ప్లేట్లు వితరణ
దువ్వూరు, మార్చి 5: మండల కేంద్రమైన దువ్వూరులోని ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలకు శనివారం పాశం ఎస్టేట్ అధినేతలు పాశం లక్ష్మినరస య్య, రామమోహన్‌లు 245 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దువ్వూరులోని 5వ అంగన్వాడీ కేంద్రంలో దువ్వూ రు సర్పంచ్ చండ్రాయుడు, మండల ఉపాధ్యక్షురాలు రహమతున్నీసా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రజియాబాను విద్యార్థులకు ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు దాతలను సత్కరించారు.
Updated Date - 2022-03-06T04:50:30+05:30 IST