వైసీపీ నేత దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2022-08-05T05:27:08+05:30
ఉమామహేశ్వరి మరణాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేత దేవేందర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా
రాయచోటిటౌన్, ఆగస్టు 4: ఉమామహేశ్వరి మరణాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేత దేవేందర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం ఆయన రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సోషల్ మీడియాలో నారా లోకేశ్‌బాబుపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేత దేవేందర్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. శవాలపై రాజకీయం చేయడం వైసీపీకే చెల్లుబాటు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి సంఘ విద్రోహశక్తులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారితో సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. లక్ష్మీపార్వతితో పాటు విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవా లన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, పెమ్మాడపల్లె సర్పంచ్ వాసు, మాజీ సర్పంచ్ జిలాన్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.
మాటతీరు మార్చుకోకపోతే మూల్యం తప్పదు
ఫ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు
మదనపల్లె టౌన్, ఆగస్టు 4: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై అనుచిత వాఖ్యలు చేస్తున్న ఎంపీ విజయ్‌సాయిరెడ్డి మాటతీరు మార్చుకోకుంటే మూల్యం చెల్లించక తప్పదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హెచ్చరించారు. గురువారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి దిష్టిబొ మ్మను దహనం చేశారు. అనంతరం మదనపల్లె టు టౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి విజయసాయిరెడ్డి, దేవేంద్రరెడ్డిలపై సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. చినబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె ఉమమహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే, లేని సర్వే నెంబర్లు క్రియేట్ చేసి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ట్విట్టర్లలో అవాస్తవాలు పోస్టు చేశారన్నారు. కార్యక్రమంలో నాదెళ్ల అరుణ్‌తేజ తదితరులు పాల్గొన్నారు. కాగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు బోయపాటి రాణా ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ రవిమ నోహరచారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో వైసీపీ నాయకుడు దేవేంద్రరెడ్డిపై ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-08-05T05:27:08+05:30 IST