ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌లో ప్రత్యేక రాయలసీమ బిల్లు ప్రవేశపెట్టాలి

ABN, First Publish Date - 2022-01-23T05:02:47+05:30

రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక రాయలసీమ బిల్లును ప్రవేశపెట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కుంచం వెంకటసుబ్బారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 22 : రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రత్యేక రాయలసీమ బిల్లును ప్రవేశపెట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.  ఈ మేరకు శనివారం స్థానికంగా ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించి, ప్రత్యేక రాయలసీమ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ పంపుతున్నట్లు తెలిపారు. రాయలసీమలో అపారమైన ఖనిజ సంపద ఉందని, ఆ సంపద ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇది జరగాలంటే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడమో, లేక కేంద్రపాలిత ప్రాంతంగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి, రాజ్యాంగంలోని 3వ ఆర్థికల్‌ను అనుసరించి అమోదం తెలపాలన్నారు. 2023 సంవత్సరం ముగిసే లోపు ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండు చేశారు.  సమావేశంలో సమితి కార్యదర్శి మిట్టా క్రిష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising