అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-12-31T23:13:41+05:30
అనుమాన్పాద స్థితిలో కె.సుబ్బ రాయుడు (53)అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దమం డ్యంలో శనివారం వెలుగు చూసింది.
పెద్దమండ్యం, డిసెంబరు 31: అనుమాన్పాద స్థితిలో కె.సుబ్బ రాయుడు (53)అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దమం డ్యంలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు పెద్దమండ్యం గ్రామ పంచాయతీ రెడ్డివారిపల్లికు చెందిన కె.సుబ్బరాయుడు , రెడ్డికుమారి దంపతులు వ్యవసాయం చేసు కుంటు జీవనం సాగిస్తున్నారు. వారికి కొడుకు, కూతురు ఉన్నా రు. శుక్రవారం సుబ్బరాయుడు రోజు వారిగా పొలం పనులు ముగించుకొని ఇంటికొచ్చాడు. రాత్రి 8 గంటల సమయంలో పెద్దమండ్యం కు వెళ్లి వస్తానని భార్య రెడ్డికుమారి తో చెప్పి వెళ్లాడు. భర్త తిరిగి ఇంటికి రాపోవడంతో పొలం వద్దకు వెళ్లి ఉంటాడని భార్య భావించింది. శనివారం ఉదయం పెద్దమం డ్యం హైస్కూల్ సమీపంలో ఇతరుల పొలంలో సుబ్బరాయు డు మృతి చెంది శవమై కనిపించినట్లు స్థానికులు గుర్తించి కుటుంభీకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెడ్డికుమారి రోధించింది. పెద్దమండ్యం ఎస్‌ఐ వెంకటేష్ సంఘ టన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మద్యం తాగి మృతి చెందాడా...మరే ఇతర కారణాల వల్ల మృతి చెందాడని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. శవ పరీక్షల నిమిత్తం సుబ్బరాయుడి మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృత్యువాత పడిన బాఽధిత కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది. రెడ్డివారిపల్లిలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.
Updated Date - 2022-12-31T23:13:42+05:30 IST