ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-12-16T23:22:20+05:30

పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఆర్టీసీ బస్టాండ్‌ చేరువలో అంకాల్‌రెడ్డి (55) అనుమానాస్పద స్థితిలో కాలిపో యి శవమై కన్పించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సజీవదహనమా.. ? ఆత్మహత్య ? ఫ డోలాయమానంలో పోలీసులు

రాజంపేట, డిసెంబరు 16: పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఆర్టీసీ బస్టాండ్‌ చేరువలో అంకాల్‌రెడ్డి (55) అనుమానాస్పద స్థితిలో కాలిపో యి శవమై కన్పించాడు. శుక్రవారం తెల్లవారు జామున రోడ్డుపై కాలి పడిపోయిన మృ తదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు అందించిన సమాచారం మేరకు వివరా ల్లోకెళితే.... అంకాళ్‌రెడ్డి మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లె వాసిగా గుర్తించారు. ఇత నికి వివాహమై ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా కుమార్తెలకు వివాహం అయిపో గా భార్య మృతి చెందడంతో అంకాళ్‌రెడ్డి ఎప్పుడో ఇంటి నుంచి బయటపడి కుమార్తెల వద్దకు కూడా వెళ్లకుండా తిరిగేవాడని గుర్తించారు. ఇదే క్రమంలో తిరుపతి జిల్లా పుత్తూరుకు వెళ్లి రాజంపేటలో గురువారం దిగాడని తెలిసింది. గురువారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ప్రధాన రహదారిపై కాలిపోయిన శరీరం కన్పించింది. ఇతన్ని ఎవరైనా కాల్చారా లేకుంటే కాల్చుకున్నాడా అన్న విషయం కూడా తెలియరావడం లేదు.

సమా చారం అందుకున్న డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ నరసింహరావు, ఎస్‌ఐలు వెంకటేశ్వ ర్లు ప్రతాప్‌రెడ్డి సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు. అతని జేబులో ఉన్న కొన్ని కాగితాలను పరిశీలించి అందులోని కొన్ని ఫోన్‌నెంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు అడి గి తెలుసుకున్నారు. అయితే మృతుని కుమార్తెలకు ఫోన్‌ చేసినా వారు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు చేసేది లేక పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అంకాళ్‌రెడ్డి కాలిపోయి ఉండడాన్ని వారి కి బంధువులకు తెలియజేశామన్నారు. ఇతన్ని ఎవరైనా కాల్చి చంపారా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియడం లేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-16T23:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising