ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
ABN, First Publish Date - 2022-12-23T23:07:51+05:30
కడప నగరం హరిత హోటల్‌లో టీడీపీ రాష్ట్ర క్రిష్టియన్ సెల్ ఉపాధ్యక్షులు ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో ఘనం గా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 23: కడప నగరం హరిత హోటల్‌లో టీడీపీ రాష్ట్ర క్రిష్టియన్ సెల్ ఉపాధ్యక్షులు ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో ఘనం గా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఘనంగా చేసుకు నే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకు ని చేసుకునే అతి పెద్ద పండుగ అని తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో మనమంతా నడవాలని సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ పట్టభద్రు ల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధితో పాటు వివిధ సంఘాల పాస్టర్లు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-23T23:08:05+05:30 IST