ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుకూరులో ఘనంగా పెద్దపీర్ల మెరవణి

ABN, First Publish Date - 2022-08-09T05:27:39+05:30

మండ లంలోని కందుకూరులో సోమవారం పెద్ద పీర్ల మెరవణి కార్యక్రమం వైభ వంగా జరిగింది.

పెద్దపీర్ల ఊరేగింపు దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దతిప్పసముద్రం ఆగస్టు 8 : మండ లంలోని కందుకూరులో సోమవారం  పెద్ద పీర్ల మెరవణి కార్యక్రమం  వైభ వంగా జరిగింది. వారం రోజుల నుంచి కందుకూరులో గ్రామ చావడిలో పీర్లను అలంకరించి మొహర్రం ఉత్స వాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఆదివారం అర్ద రాత్రి దాటిన తరువాత పెద్ద పీర్ల మెరవణి ఉత్సవం ప్రారంభ మైంది. కుక్క లపల్లెకు చెందినపెద్ద పీరును ప్రత్యేకంగా అలంకరించి కందుకూరు గ్రామంలో మెరవణి వైభవంగా సాగింది. హిందు ముస్లింలు కలసి ఐక్యమత్యంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీటీఎంతోపా టు సత్య సాయి జిల్లా నుంచి అఽధిక సంఖ్యలో ప్రజలు కందుకూరుకు పీర్ల మెరవణిలో పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లెలో హిందూ ముస్లింలు మొహర్రం పండు గను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నా రు.  సోమవారం తెల్లవారు జామున పెద్ద పీరు మొరవణి కోలాహలంగా సాగింది. అనంతరం పీర్లను అగ్నిగుండ ప్రవేశం చేసి గ్రామంలో ఊరేగించారు. మంగళవారం  పీర్ల్లకు జలధి నిర్వహించను న్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పీర్ల చావిడి వద్ద అన్నదానం

తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపం లో ఉన్న శేషసాయి బాబా ఆలయ వేదపండితుడు స్కందమూర్తి శర్మ పీర్ల పండుగ సందర్భంగా అన్నదానం నిర్వ హించారు. తంబళ్లపల్లెలో  వారం రోజు లుగా మొహర్రం పండుగను హిందూ ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నా రు. అదేవిధంగా, రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన కళాకారు లకు స్కందమూర్తి శర్మ శిష్యుడు శబరీస్‌ స్థానిక బాబా ఆలయంలో రూ.10 వేలు విరాళం అందచేశారు.

పీలేరులో: మొహర్రం పండుగ సం దర్భంగా స్థానిక ముజావర్‌ ఖాదర్‌ వలీ సోమవారం స్థానిక పెద్దపీర్ల చావిడి వద్ద పేదలకు అన్నదానం చేశారు. మొహర్రం పండుగలో భాగంగా సోమవారం వేకువజామున బోడుమల్లువారిపల్లెలోని పీర్లును పీలేరులోని పెద్దపీర్ల చావిడిలో కొలువైన పీర్లతో కలిపి గ్రామోత్సవం నిర్వహించారు ముజావర్లు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. 

Updated Date - 2022-08-09T05:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising