ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పెళ్లి సందడి’కి విరామం

ABN, First Publish Date - 2022-08-22T05:05:29+05:30

తెలుగు లోగిళ్లలో పెళ్లి సందడికి విరామం లభించింది. ఈనెలలో పరిమిత సంఖ్యలో ఉన్న ముహుర్తాలతో అపరిమితంగా జరిగిన పెళ్లిళ్లకు ఆదివారంతో బ్రేక్‌ పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఆగస్టు 21: తెలుగు లోగిళ్లలో పెళ్లి సందడికి విరామం లభించింది. ఈనెలలో పరిమిత సంఖ్యలో ఉన్న ముహుర్తాలతో అపరిమితంగా జరిగిన పెళ్లిళ్లకు ఆదివారంతో బ్రేక్‌ పడింది. అయినా ఈనెల చివర్లో ఒకటీ అరా సర్దుబాటు ముహూర్తాలతో వివాహాలు జరగనున్నట్లు చెబుతున్నారు. ఇక సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో అసలు ముహూర్తాలే లేకపోవడంతో డిసెంబరు వరకూ కల్యాణ ఘడియల కోసం ఆగాల్సిందేనంటున్నారు. డిసెంబరులో సైతం కేవలం 11 రోజులు మాత్రం సిద్ధాంత ముహూర్తాలున్నాయని ఆ తరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మంచి రోజులు వస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈనెల రాబోయే వచ్చే శనివారంతో శ్రావణ మాసం వెళ్లిపోతుంది. భాద్రపద మాసం ప్రారంభం కావడంతో పాటు సెప్టెంబరు నుంచి శుక్రమూఢమి ప్రారంభమవుతున్న కారణంగా కల్యాణమస్తుకు మూడు నెలల పైబడి పూర్తి విరామం తప్పదని సిద్ధాంతులు చెబుతున్నారు. ఇక జనవరి చివరలో ఒకటీ అరా సర్దుబాటు ముహూర్తాలతో మంచి రోజులు ప్రారంభమైనా సిద్ధాంత ముహూర్తాల కోసం ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసం వరకూ ఆగాల్సిందేనంటున్నారు. అక్కడి నుంచి తిరిగి శుభ ముహూర్తాలతో కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. అయినా ఇంత సుదీర్ఘ కాలంపాటు ముహూర్తాలకు కొరత రావడం గతంలో అరుదుగా మాత్రమే జరిగేదని పలువురు పురోహితులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-22T05:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising