టెంపో ఢీకొని 31 మేకలు మృతి
ABN, First Publish Date - 2022-07-16T05:06:23+05:30
రోడ్డుపై వెళుతున్న మేకల గుంపును టెంపో వాహనం ఢీకొనడంతో 31 మేకలు మృతి చెందిన సంఘటన మార్కెట్ యార్డు సమీపంలో శుక్రవారం వే కువ జామున జరిగింది.
గుర్రంకొండ, జూలై 15:రోడ్డుపై వెళుతున్న మేకల గుంపును టెంపో వాహనం ఢీకొనడంతో 31 మేకలు మృతి చెందిన సంఘటన మార్కెట్ యార్డు సమీపంలో శుక్రవారం వే కువ జామున జరిగింది. స్థానికుల వివరాల మేరకు పట్టణంలోని బలి జగడ్డకు చెందిన అహ్మద్ తన మేక లను పంచాయతీ పరిధిలోని దౌలత్ ఖాన్‌పల్లెకు చెందిన అంజికి మేపడా నికి తోలించాడు. ఈ క్రమంలో అంజి గురువారం మేకలను మేత కోసం అడవికి తోలుకెళుతుండగా మేకల గుంపు దారి తప్పడంతో అర్ధరాత్రి గుర్రంకొండకు బయలుదేరాడు. ఈ నేపథ్యంలో మార్కెట్ యా ర్డు సమీపంలోని జంగ్లీఫీర్ దర్గా వద్ద వస్తుండగా రాయచోటి నుంచి మదనపల్లె వైపు వెళుతున్న ఐసర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 31 మేకలు మృతి చెందగా, 7 మేకలు గాయపడగా, 30 మేకలు ప్రమాదం నుంచి తప్పించుకొన్నాయి. అంతేకాకుం డా రోడ్డు పక్కనే ఉన్న నవాజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చనిపోయిన మేకల విలువ రూ.4 లక్షలు ఉంటుందని యజమాని తెలుపుతున్నాడు. మేకల మృతిపై కేసు నమో దు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు హెచ్‌సీ శివప్రసాద్ తెలిపారు.
Updated Date - 2022-07-16T05:06:23+05:30 IST