ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2017 పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2022-04-25T04:48:00+05:30

ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు 

రాయచోటి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాయచోటిలోని ఆర్‌ఆర్‌ కల్యాణ మండపంలో కడప జిల్లా అధ్యక్షుడు పీఎన్‌బీ రెడ్డి అధ్యక్షతన రీజనల్‌ కార్యదర్శి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన రీజనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీనానికి ముందు 2020 జూన్‌లో చేసుకున్న ఒప్పందం ఇంత వరకూ అమలు కాలేదన్నారు.

యూనియన్‌ చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్రహ్మణ్యంరాజు, ఉప ప్రధాన కార్యద ర్శి ఆవుల ప్రభాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ జీతాల పెం పుపై జీఓలు విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు.  మరో ఉప ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 22న ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు  45 డిమాండ్లతో ఒక వినతిపత్రం ఇచ్చామన్నారు. వీట న్నింటిపై త్వరలో ఆర్టీసీ వీసీ, ఎండీకి మరో మెమొరాం డం ఇవ్వనున్నామన్నారు. స్పందనను బట్టి  భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


కార్యవర్గం ఎన్నిక

పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కడప జిల్లా అధ్యక్షుడి గా సుభాష్‌బాబు (బోస్‌), జిల్లా కార్యదర్శిగా రామ్మూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మల్లికార్జున, వైస్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వర్లు, రాజంపేట డిపో ట్రెజరర్‌గా ఆర్‌బీఎస్‌ హ్మణ్యంను ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-04-25T04:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising