ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికే..జ్యోతుల నెహ్రూ

ABN, First Publish Date - 2022-11-01T17:13:40+05:30

Kakinada: వైసీపీ (YCP) మంత్రుల రాజమండ్రి సమావేశంతో కాపు సామాజిక వర్గానికి ఏ ప్రయోజనం ఉండదని, కేవలం కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికే దాన్ని ఏర్పాటు చేశారని టీడీపీ (TDP) ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kakinada: వైసీపీ (YCP) మంత్రుల రాజమండ్రి సమావేశంతో కాపు సామాజిక వర్గానికి ఏ ప్రయోజనం ఉండదని, కేవలం కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికే దాన్ని ఏర్పాటు చేశారని టీడీపీ (TDP) ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) పేర్కొన్నారు. బాధ్యత గల మంత్రులు, ప్రజాప్రతినిధులు కాపులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళ్తే వైసీపీకి భవిష్యత్తు ఉండదని, ఆ కారణంగానే కులాల మధ్య చిచ్చు రగిల్చేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రంగ హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ‌లోనే ఉన్నాడన్న విషయం ఆ పార్టీ నేతలు మర్చిపోకూడదన్నారు. చంద్రబాబును కాపులకు శత్రువుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం‌లో కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని జ్యోతుల నెహ్రూ గుర్తు చేశారు.

Updated Date - 2022-11-01T17:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising