ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలి: జయప్రకాష్

ABN, First Publish Date - 2022-02-02T22:41:58+05:30

దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ అన్నారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ జిన్నా టవర్ అంశం ముస్లింలు, హిందువుల కోసం కాదన్నారు. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టవర్ పేరు మార్చకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కానీ గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయన్నారు. జిన్నా టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. 26వ తేదీన టవర్‌పై జాతీయ జెండా ఎగుర వేసే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారన్నారు.


బీజేపీ డిమాండ్ మేరకు టవర్‌కు రంగులు మార్చారని, జాతీయ జెండా దిమ్మె పెట్టడం శుభపరిణామమన్నారు. జాతీయ జెండా రంగులు మన దేశానికి గర్వ కారణమన్నారు. ముడు రంగులు ఉన్న టవర్‌‌‌కు జిన్నా పేరు పెట్టడం దేశ ద్రోహమన్నారు. దేశ ప్రజలను తీవ్రంగా అవమానించినట్లేనన్నారు. బీజేపీ జాతీయ జెండా ఎగుర వేస్తే మత విద్వేషాలు వస్తాయన్నారన్నారు. మీరు టవర్‌కు రంగులు మార్చినా, జాతీయ జెండా పెడుతున్నా ఏ మత విద్వేషాలు రాలేదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-02T22:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising