ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP floods: వరద బాధితులకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల చేయూత

ABN, First Publish Date - 2022-07-22T17:28:55+05:30

వరద కారణంగా నీటిమునిగి ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీ యాజమాన్యాలు చేయూతనందించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): వరద కారణంగా నీటిమునిగి ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు ప్రైవేటు స్కూల్స్‌(Private schools), కాలేజీల(collages) యాజమాన్యాలు చేయూతనందించాయి. జంగారెడ్డిగూడెం ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్ అండ్ కాలేజీల యాజమాన్యాలు... వేలేరుపాడు(Velarupadu) మండలంలో నీట మునిగిన గ్రామాల్లో  కూరగాయలు, నిత్యావసర సరుకులను సరఫరా చేశాయి.


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన మన్యం లోతట్టు గ్రామ ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో    ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వేలేరుపాడు మండలం చాగర్లపల్లి, కన్నాయిగుట్ట, నార్లవరం కాలనీ, కొత్తూరు గ్రామ ప్రజలకు తమవంతు సాయం అందించేందుకు జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 7 రకాల కూరగాయలు, 11 రకాల కిరాణా సరుకులు, ఒక్కొక్క దుప్పటి చొప్పున 4 గ్రామాలకు సహాయం  అందించారు.


ఈ కార్యక్రమంలో సూర్య విద్యా సంస్థల అధినేత ఈడా సూర్య చంద్ర శ్రీనివాసరావు(Eeda surya chandra srinivas rao), విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత వి. శ్రీనివాసరావు(V.Srinivasrao), శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత సింగిరెడ్డి సత్యనారాయణ(Sinireddy satyanarayana), ప్రతిభ హై స్కూల్ కరెస్పాండంట్ సత్యనారాయణ రెడ్డి(Satyanarayana reddy), శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ యన్. హరిప్రసాద్(S.Hariprasad), భూదేవి పేట ముత్యాలు(Mutyalu) పాల్గొన్నారు.

Updated Date - 2022-07-22T17:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising