ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సర్కార్‌కు సంక్రాంతి వరకు టైమ్.. ఆ తర్వాత స్వయంగా రంగంలోకి పవన్!

ABN, First Publish Date - 2022-01-03T00:19:04+05:30

మిర్చి రైతులను ఆదుకునేందుకు జగన్ సర్కార్‌కు జనసేన పార్టీ సంక్రాంతి వరకూ టైమ్ ఫిక్స్ చేసింది. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జగన్ సర్కార్‌కు జనసేన పార్టీ సంక్రాంతి వరకూ టైమ్ ఫిక్స్ చేసింది. స్పందించకపోతే ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారట. ఈ విషయాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  సంక్రాంతి లోపు ధాన్యం కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంక్రాంతి వెళ్లిన మొదటి వారంలో జిల్లా కేంద్రాలలో దీక్షలు చేపడతామని హెచ్చరించారు. 


గుంటూరు దీక్షలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటారని మనోహర్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మనోహర్ మండిపడ్డారు. నాలుగున్నర లక్షల ఎకరాలలో మిర్చి సాగు చేసి నష్ట పోయారని, రైతులు సగటున ఎకరాకు రూ70 వేలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చిన అమలు కావడం లేదన్నారు. 151 శాతం సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రజలను మోసం చేసిందని మనోహర్  విమర్శించారు. 

Updated Date - 2022-01-03T00:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising