ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena leader: మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై జనసేన నేత విజయ్ కుమార్ కౌంటర్

ABN, First Publish Date - 2022-08-16T20:27:19+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan)పై మంత్రి అమర్నాథ్ (Amarnath) చేసిన వ్యాఖ్యలపై జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ (Sundarapu vijay kumar) కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ అధినాయకత్వం వద్ద బానిస బతుకు కొనసాగిస్తున్న మంత్రి అమర్నాథ్‌కు స్వతంత్రం సిద్ధించాలన్నారు. ‘‘మిమ్మల్ని, నీ మంత్రులు, ఎమ్మెల్యేలను చివరకు మీ పార్టీ క్యాడర్ను చూసి రాష్ట్రం జాలి పడుతుంది. జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో పక్కనపెట్టి... నీకు మంత్రి పదవి ఇచ్చిన అనకాపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా?’’ అని సవాల్ విసిరారు. గాజువాక నియోజవర్గంలో పుట్టి... అక్కడ పోటీ చేయలేక అనకాపల్లిలో పోటీ చేసి తమపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ కబంధహస్తాల నుంచి రాష్ట్ర ప్రజలకు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విముక్తి కల్పిస్తుందని విజయ్ కుమార్ అన్నారు. 

Updated Date - 2022-08-16T20:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising