ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జనవాణి జనసేన పేరుతో భరోసా కార్యక్రమం: పోతిన వెంకట్

ABN, First Publish Date - 2022-07-02T16:44:21+05:30

బాధిత పక్షాలకు అండగా నేనున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి జనసేన పేరుతో భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బాధిత పక్షాలకు అండగా నేనున్నానని జనసే(Janasena)న అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) జనవాణి జనసేన పేరుతో భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్(Potina venkata mahesh) తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనసేన జనవాణి జరుగుతుందని వెల్లడించారు. ఈ వేదిక ద్వారా బాధిత ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, ప్రజాసంఘాలకు అండగా నిలుస్తారన్నారు. సమస్య ఏదైనా ఎవరిదైనా పార్టీలకు అతీతంగా అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్  కృషి చేస్తారని చెప్పారు. సామాన్య ప్రజల సమస్యలు వినడానికి అధికార పార్టీ నాయకులకు తీరికలేదన్నారు. జగన్‌ మోహన్ రెడ్డి(Jagana mohan reddy)కి ప్రజాసమస్యలు పరిష్కరించాలన్న దృష్టి లేదని విమర్శించారు. అందుకే వారు బయటకు రావడం లేదని... ప్రజలు వెళ్లినా కలవడం లేదని అన్నారు. జనవాణి జనసేన కార్యక్రమానికి పేదలు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చని పోతిన వెంకట మహేష్ తెలిపారు. 


Updated Date - 2022-07-02T16:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising