ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన ఓ చలనం లేని పార్టీ: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2022-03-15T21:47:46+05:30

సీఎం జగన్‌పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేన పార్టీని ఓ చలనం లేని పార్టీగా అభివర్ణించారు. ఓ చలనం లేని పార్టీ ఏదో సంచలనం ప్రకటించినట్టు తాము చూడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి అధికారంలోకి రావాలనే లక్ష్యం లేదన్నారు. తాను జగన్‌ను అధికారంలోకి రానివ్వబోమని అంటున్నాడని, పవన్ లక్ష్యం చంద్రబాబును సీఎంను చేయడమేనని ఆయన పేర్కొన్నారు. మీటింగ్‌కు, టీజర్‌కు ఉన్నత హడావుడి సినిమాకు లేదన్నారు. టీడీపీకి అనుబంధంగా జనసేన పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ రోడ్ మాప్ ఇవ్వాలి అని ఆయన ఎదురుచూస్తున్నారన్నారు. కానీ మీకు ఏ రోడ్ మ్యాప్ లేదు, రోడ్ లేదని ఆయన విమర్శించారు. బీజేపీని కూడా టీడీపీతో కలిసి పనిచేయ్యాలంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరో వస్తారు అని జగన్ ఎదురు చూడడం లేదన్నారు.


సోనియాగాంధీ నుంచి చంద్రబాబు వరకు అందర్నీ ఒంటి చేత్తో జగన్ ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతం, లక్ష్యం జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌ను కూలదోయడమేనని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో వీరిద్దరూ కలిసే పనిచేసారన్నారు. పనితీరులో దేశంలోనే నెంబర్ 1గా జగన్ పనితీరు ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఒక్కటేనని ఆయన అన్నారు. మంత్రులు, నాయకులను విమర్శించడమే పవన్ ఒక పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా అంత తేలికగా ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయలేరని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-03-15T21:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising