ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan comments: వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పవన్

ABN, First Publish Date - 2022-09-18T19:02:24+05:30

వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీకి ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ (YCP) ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) జోస్యం చెప్పారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన జనసేన లీగల్‌సెల్ సమావేశం (Janasena Legal Cell meeting)లో మాట్లాడుతూ... ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో (Elections) వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చని తమకు చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందన్నారు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు వివరించారు. గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్‌ (Janasena chief) అన్నారు. 


అలాంటి అభ్యర్థులనే ఎంపిక చేస్తాం...

జనసేన(Janasena)కు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ఈసారి అసెంబ్లీ (AP Assembly)లో జనసేన జెండా ఎగరాలని అన్నారు. జనసైనికులు పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేనకు బలమైన స్థానాలను గుర్తించి అక్కడ బాగా పని చేయాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో చేపట్టే జనసేన యాత్ర (Janasena yatra) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన జనసేనాని పార్టీ బలోపేతంపై అధ్యయనం పూర్తయ్యాక యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తామని అన్నారు. 


ఎన్టీఆర్‌తో పోటీ పడలేం... 

వేగంగా అధికారం అందుకోవడం లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. మహనీయుడు ఎన్టీఆర్‌(NTR)తో పోటీ పడలేమని, మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పార్టీలు నిలబడాలంటే బలమైన సిద్ధాంతాలు ఉండాలని అన్నారు. 2019 ఓటమి తరువాత పార్టీ వదిలేసి పారిపోతానని చాలామంది ఆశించారని... వారి కోరిక నేరవేరకుండా చేశానన్నారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కేందుకు కృషి చేస్తున్నానన్నారు. తన దగ్గర అపరిమిత ధనం లేదని, ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని అన్నారు. ‘‘నా దేశాన్ని, నా నేలను, నా పార్టీని వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో జనసేనకు కనీసం 10 సీట్లు వచ్చినా తమ పోరాటం మరోలా ఉండేదని జనసేన చీఫ్ అభిప్రాయపడ్డారు. 


3 రాజధానుల పేరుతో వివాదం చేసింది ఎవరు?

ఏపీకి నేడు రాజధాని (AP Capital) లేకుండా పోయిందని పవన్ అన్నారు. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కిపోతే ఇక విలువేముందని ప్రశ్నించారు. వేల ఎకరాలు వద్దు.. చిన్న రాజధాని చాలని మిత్రపక్షంగా చెప్పానన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని.. ఇక్కడే ఇల్లు కట్టానని.. అమరావతిని అభివృద్ధి చేస్తానని అన్నారని తెలిపారు. ఓట్లు వేయించుకున్నాక మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో వివాదం చేసింది ఎవరని పవన్ కళ్యాణ్ (Janasena leader) ప్రశ్నించారు. 


Updated Date - 2022-09-18T19:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising