ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan kalyan: ఏ పేరుతో పిలిచినా... ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభదినం

ABN, First Publish Date - 2022-09-17T15:45:14+05:30

తెలంగాణ బిడ్డలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలంగాణ బిడ్డలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నిత్య చైతన్య దీప్తి తెలంగాణ (Telangana). చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ. అటువంటి ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17. దీనిని విమోచన అనండి లేదా విలీనం అనండి. ఏ పేరుతో పిలిచినా సరే.. ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం. ప్రజలకు బానిస సంకెళ్లు తొలగిన మరపురాని దినం. తెలంగాణ వాసులందరికీ పండుగ దినం. 75వ విమోచన దినోత్సవం జరుపుకొంటున్న శుభ తరుణాన... తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిరంకుశ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం అశువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు అర్పిస్తున్నాను.. ఈ గడ్డలోని అనువణువునా నిక్షిప్తమైన పోరాటతత్త్వం, అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది కళకళలాడాలని, ప్రజలు సుఖశాంతులు, సంపదలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ పవన్ కళ్యాణ్(Janasena chief) పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-17T15:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising