ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan kalyan: సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం

ABN, First Publish Date - 2022-09-13T18:08:06+05:30

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం (Secundrabad fire accident) ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) స్పందించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు గురైనట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అగ్ని ప్రమాదంలో పలువురు క్షతగాత్రులయ్యారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందినట్లు చెప్పారు.


వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని (Telangana government)కి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరోరారు. పర్యాటకంగా, వాణిజ్యపరంగా, ఐటీ రంగంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాజధానిలో ఇటువంటి ప్రమాదాలకు తావు లేకుండా చూడాలని... హోటల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో ఎప్పటికప్పుడు అగ్నిమాపక, ఇతర రక్షణ తనిఖీలు చేయించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పవన్‌ కళ్యాణ్ (Janasena chief) సూచించారు. 

Updated Date - 2022-09-13T18:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising