ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ నిత్య ఆరాధనీయుడు: Pawan

ABN, First Publish Date - 2022-04-14T16:58:47+05:30

నిత్య ఆరాధనీయుడు బి.ఆర్.అంబేద్కర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నిత్య ఆరాధనీయుడు బి.ఆర్.అంబేద్కర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశ చరిత్రలో చిరంతనంగా నిలిచిపోయే మహానుభావుడు భారతరత్న బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు. ‘‘ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన ఆ జ్ఞాన సంపన్నుడి 131వ జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన ఆయనకు ప్రణామాలు ’’ తెలియజేశారు. ఈనాడు మన దేశం ఆర్థికంగా, సామాజికంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారణం  అంబేద్కర్ ఆధ్వర్యంలో  రూపుదిద్దుకున్న పటిష్టమైన  రాజ్యాంగమే అని చెప్పుకొచ్చారు. ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచారన్నారు. అంబేద్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని జనసేనాని తెలిపారు.


లండన్‌లో అంబేడ్కర్ నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన పేరిట ఏర్పాటైన స్మారక మందిరాన్ని  సందర్శించినప్పుడు తాను పొందిన అనుభూతి మాటలలో చెప్పలేనని వెల్లడించారు. ఈ దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని  అంబేడ్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని సదా అనుసరిస్తూ నాదైన సేవను ఈ దేశ ప్రజలకు అందచేస్తానని ఈ పుణ్యదినం సందర్భంగా పునరుద్ఘాటిస్తూ అంబేద్కర్‌కు పవన్ జేజేలు పలికారు. 


Updated Date - 2022-04-14T16:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising