ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

The Debate: విద్యా వ్యవస్థనే అస్తవ్యస్తం చేసిందెవరు?.

ABN, First Publish Date - 2022-08-12T01:43:36+05:30

విద్యార్ధులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విద్యార్ధులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో జగనన్న విద్యా దీవెన (Jagananna vidya deevena) కార్యక్రమంలో సీఎం పాల్గొని... విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన సాయం కింద నగదు జమ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) కింద 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు సాయం విడుదల చేశారు. అయితే కాలేజీలకు కాకుండా తల్లిదండ్రుల ఖాతాల్లో వేయడంపై పలు ప్రశ్నలు తలెత్తతున్నాయి. డైరెక్ట్‎గా కాలేజీలకు ఫీజు రీయింబర్స్ డబ్బులు వెళ్తే విద్యార్థిపై ఒత్తిడి ఉండే అవకాశం ఉండదంటున్నారు. తల్లులు అకౌంట్‎లో వేయడం వల్ల  ఏదైనా అవసరం వచ్చి వాళ్లు ఆ  డబ్బులను ఖర్చు చేస్తే సమయానికి కాలేజీలో ఫీజు కట్టకపోతే విద్యార్థిని అడుగుతారు కదా అని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఫీజు రీఎయింబర్స్ పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘విద్యా వ్యవస్థనే అస్తవ్యస్తం చేసిందెవరు?. అమ్మ ఒడి పేరుతో కాకమ్మ కబుర్లు చెప్తున్నదెవరు?. ఫీజు రీయింబర్స్‎మెంట్‎ను అపహాస్యం చేసిందెవరు?. విద్యా కానుక అంటూ డూప్లికేట్ బ్యాగులిచ్చిందెవరు?. అసలు లక్షలాది మంది పిల్లలు చదువెందుకు మానేశారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-08-12T01:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising