ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాప్తాడు ఎమ్మెల్యే చేతికి జగనన్న కాలనీ!

ABN, First Publish Date - 2022-10-05T08:48:49+05:30

రాప్తాడు ఎమ్మెల్యే చేతికి జగనన్న కాలనీ!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెండరు లేకుండానే రూ.400 కోట్ల.. ప్రాజెక్టు హస్తగతం

సమీక్షా సమావేశాల్లో ఏకంగా వేదికపైనే తోపుదుర్తికి చోటు


గుంటూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలపై జరుగుతున్న సమీక్షల్లో అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొంటుండడం ఆసక్తి రేపుతోంది. గతంలో ఒక దఫా జరిగిన సమావేశానికి హాజరైన ఆయన.. తాజాగా మంగళవారం కూడా కలెక్టరేట్‌కు వచ్చారు. జిల్లాకు సంబంధించిన ఈయనకు లింకేమిటని ఆరా తీయగా.. ఆయనకు చెందిన సంస్థ పేరేచర్లలోని జగనన్న కాలనీ భారీ లేఅవుట్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. ఇక్కడ 14 వేలకు పైగా ఇళ్లను ఆప్షన్‌-3లో నిర్మించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనులు కలిపితే ప్రాజెక్టు విలువ రూ.400 కోట్లకు పైనే ఉంటుంది. ఎలాంటి టెండరూ లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేకు కట్టబెట్టేశారు. కాంట్రాక్టరుగా ఉన్న తోపుదుర్తిని జిల్లా అధికారులు ఏకంగా వేదిక పైకి ఎక్కించారు. మిగతా కాంట్రాక్టర్లు మాత్రం కిందే కూర్చున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ మీటింగ్‌ హాలులో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా పాల్గొన్నారు.


Updated Date - 2022-10-05T08:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising