ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలి: రఘురామ

ABN, First Publish Date - 2022-01-27T20:37:13+05:30

సీఎం జగన్‌రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం రాజ్యాంగాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సీఎం జగన్‌రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తే 200 కేసులను ఓడిపోయేవాళ్లం కాదన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే తనను కొట్టారని తెలిపారు. ఒక ఎంపీ నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జీవోలు అమలు చేసి జిల్లాల విభజన చేపడుతున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అంటున్నారని, అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? అని రఘురామ ప్రశ్నించారు. కేబినెట్‌లో జిల్లాలపై చర్చ జరగకుండానే.. అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరమేంటి? అని రఘురామ ప్రశ్నించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామకృష్ణరాజు సూచించారు. 


‘‘ఉద్యోగులు ఫిట్మెంట్ అడిగితే.. మీరేమో సెటిల్మెంట్ చేస్తున్నారు..ఇది సరికాదు. అశోక్‌బాబుపై అక్రమ కేసులు పెట్టారు. అశోక్‌బాబు చదివిన చదువు ఉద్యోగానికి సరిపోతుంది. ఐదో తరగతి చదువుకున్న వారికి మంత్రి పదవి ఇచ్చారు. సలహాదారులను కూడా నియమించారు’’ అని రఘురామ విమర్శించారు.

Updated Date - 2022-01-27T20:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising