ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో విశాఖ నుంచి జగన్‌ పాలన

ABN, First Publish Date - 2022-10-07T08:22:30+05:30

త్వరలో విశాఖ నుంచి జగన్‌ పాలన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే విజయదశమి నాటికి పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి

శాంతియుతంగా పోటీ పాదయాత్ర: మంత్రి అమర్‌నాథ్‌


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 6: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారని, వచ్చే విజయ దశమి నాటికి ఆ ప్రాంతం పూర్తిస్థాయి రాజధాని కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన బుధవారం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పాదయాత్ర పేరుతో విద్వేషాలు సృష్టించాలనుకుంటే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించదు. వివాదాస్పదమైన ఈ యాత్రను ఇప్పటికైనా నిలిపివేయాలి. అమరావతిలోనే పూర్తిగా రాజధాని నిర్మిస్తే, ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు ప్రత్యేక రాష్ట్రాలు కోరుకుంటారు. అప్పుడు అమరావతిని కూడా వదులుకోవలసి వస్తుంది’’ అని అమర్‌నాథ్‌ తెలిపారు. ‘‘అమరావతి రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తూ వైసీపీ తరఫున శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాం. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ సమావేశాలు నిర్వహిస్తాం’’ అని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో గురువారం సాయంత్రం విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో వైసీపీ నేతల సమావేశం జరిగింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, అమర్‌నాథ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రకు దీటుగా వైసీపీ కూడా యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. 


Updated Date - 2022-10-07T08:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising