ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం జగన్

ABN, First Publish Date - 2022-01-04T15:37:14+05:30

న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతొంది. మంగళవారం ఉదయం కేంద్రరవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బలశౌరి, మార్గాని భారత్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో రహదారుల ఏర్పాటు, రోడ్ల విస్తరణపై చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు సమావేశం జరిగింది.


రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు నితిన్ గడ్కరీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపారు. సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌కారిడర్‌ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందన్నారు. విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని నితిన్ గడ్కరీని సీఎం జగన్ కోరారు. 

Updated Date - 2022-01-04T15:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising