ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

ABN, First Publish Date - 2022-08-22T17:43:52+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)తో ఏపీ సీఎం జగన్ (CM Jagan) భేటీ (Meeting) ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)తో ఏపీ సీఎం జగన్ (CM Jagan) భేటీ (Meeting) ముగిసింది. 30 నిముషాలపాటు ఇరువురి సమావేశం జరిగింది. జగన్ వెంట విజయసాయి రెడ్డి (Vijayasai reddy) ఉన్నారు. పలు కేసులు చుట్టుముడుతున్న వేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఉన్న కేసులకు తోడు వివేకా హత్య కేసు (Viveka murder case), ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Liquor scam)పై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య కేసులో త్వరలోనే కీలక పరిణామాలు జరుగుతాయంటూ ఇప్పటికే చర్చ జరుగుతోంది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వైసీపీ నేతలకు లింకులు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. విజయసాయి బంధువులు సహా పలువురు వైసీపీ నేతల ప్రమేయంపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. ఏపీలో లిక్కర్ సహా ఇతర మాఫియాలు పాలిస్తున్నాయంటూ కేంద్ర మంత్రి ఠాకూర్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డర్టీ వీడియోతో ఎంపీ గోరంట్ల వ్యవహారం కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎంపీ మాధవ్‌పై చర్యల కోసం ఇప్పటికే ప్రధాని, లోక్ సభ స్పీకర్, జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. ఈ పరిణామాలకు తోడు ఇటీవల ఢిల్లీలో చంద్రబాబు, మోదీ షేక్ హ్యాండ్‌తో వైసీపీ ఉలిక్కిపడింది. హైదరాబాద్‌లో అమిత్ షా, రామోజీరావు భేటీపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామాలన్నీ వైసీపీలో కలవరం రేపుతున్నాయి.


Updated Date - 2022-08-22T17:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising