ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan చేతకాని సీఎం: కేఏ పాల్‌

ABN, First Publish Date - 2022-07-11T02:01:44+05:30

జగన్‌ (Jagan) చేతకాని సీఎం అని, రాష్ట్రానికి ప్రత్యామ్నాయం ప్రజా శాంతి పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (K. A. Paul) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జగన్‌ (Jagan) చేతకాని సీఎం అని, రాష్ట్రానికి ప్రత్యామ్నాయం ప్రజా శాంతి పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (K. A. Paul) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ను అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లారని, దీంతో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. 2019లో బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతకాని సీఎంగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. ఆయన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు వల్ల రాష్ట్రం పూర్తిగా వెనుకబడి పోయిందని,. పాలనపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీకి ప్రతి రూపమేనని పాల్ ఎద్దేవా చేశారు.


సీపీఐ, సీపీఎంతో జనసేన జతకడితే బాగుండునని, బీజేపీతో చేతులు కలిపి పవన్‌ తప్పు చేశారన్నారు. మతతత్వ పార్టీ అని విమర్శిస్తూ అదే పార్టీతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. తెలుగురాష్ట్రాల్లో ప్రజా శాంతి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2024లో రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. దేశం, రాష్ట్రంలో పాలకులు మారాలని, అదే విధంగా కుటుంబ పాలన అంతం కావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-07-11T02:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising