జగన్ బటన్ నొక్కుతున్నాడు.. జనం మమ్మల్ని మర్చిపోతున్నారు: బాలినేని
ABN, First Publish Date - 2022-08-04T09:12:54+05:30
జగన్ బటన్ నొక్కుతున్నాడు.. జనం మమ్మల్ని మర్చిపోతున్నారు: బాలినేని
ఒంగోలు, ఆగస్టు 3: జగన్ బటన్ నొక్కుతున్నాడు.. జనం మమ్మల్ని మర్చిపోతున్నారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. ‘జగన్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోంది. బటన్ నొక్కి పథకాల లబ్ధిని అందిస్తున్నందువల్లే జనం మమ్మల్ని మరచిపోతున్నారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పటివరకు ప్రజలు వాసన్నా.. మా ఓటు మీకే అనే వారు. ఇప్పుడేమో మా ఓటు జగనన్నకే అంటున్నారు’ అని చెప్పారు.
Updated Date - 2022-08-04T09:12:54+05:30 IST