ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Raj Bhavan At Home Event: రాజ్‌భవన్‌లో జగన్, చంద్రబాబు.. కలిసి మాట్లాడుకుంటారో.. లేదో..!

ABN, First Publish Date - 2022-08-15T23:45:51+05:30

సీఎం జగన్ (Jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ (Jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. ఆగస్టు 15 రోజున రాజ్‌భవన్‌లో సంప్రదాయంగా నిర్వహించే ‘ఎట్‌హోమ్‌’ (At Home) కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ (Biswabhusan Harichandan) ఎట్‌హోమ్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్, చంద్రబాబుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు జడ్జీలు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రముఖులకు విందు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో అప్పటి గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమంలో సీఎం హోదాలో చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఒకే కార్యక్రమంలో జగన్‌, చంద్రబాబు పాల్గొన్నారు. 


ఒకప్పుడు చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) కలిస్తే అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే ఉండేది. చూడటానికి కూడా కన్నుల పండువగా ఉండేది. కానీ జగన్ హయాంలో అలాంటి పరిస్థితి లేదనే విమర్శలున్నాయి. ఇటీవల ఢిల్లీ(Delhi)లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశానికి జగన్‌, చంద్రబాబు ఇద్దరిని ఆహ్వానించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సమావేశం చంద్రబాబు, జగన్ పాల్గొంటారని అందరూ అనుకున్నారు. ఈ భేటీకి చంద్రబాబు మాత్రమే హాజరయ్యారు. అంతకుముందు నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల జగన్ హాజరుకాలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T23:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising