ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది దొంగల ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-15T03:32:59+05:30

రాష్ట్ర ప్రభుత్వం దొంగల ప్రభుత్వంగా మారింది. దీనికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేయాలి’’ అని కురమామిడి గ్రామం వైసీపీ సర్పంచ్‌ సుధాకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనులన్నీ కేంద్రం నిధులతోనే

రాష్ట్ర నిధుల నుంచి పైసా ఖర్చు పెట్టడం లేదు

ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి

వైసీపీ ప్రభుత్వంపై అధికార పార్టీ సర్పంచ్‌ ఫైర్‌

గాండ్లపెంట, డిసెంబరు 14: ‘‘రాష్ట్ర ప్రభుత్వం దొంగల ప్రభుత్వంగా మారింది. దీనికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేయాలి’’ అని కురమామిడి గ్రామం వైసీపీ సర్పంచ్‌ సుధాకర్‌ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కురమామిడిలో టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచ్‌ ఇంటి వద్దకు వెళ్లారు. టీడీపీ నాయకుల వద్ద సర్పంచ్‌ తన ఆవేదనను పంచుకున్నారు. ‘‘కేంద్ర నిధులతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ సెంటర్లు, నాడు-నేడు పనులు, రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. సీఎం జగన్‌ రాష్ట్ర నిధులతో ఏ అభివృద్ధీ చేయడంలేదు. గ్రామ పంచాయతీలకు కేంద్రం అందిస్తున్న నిధులను కూడా లాక్కుంటున్నారు. ఇలా చేస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇలాంటి దొంగల ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఆపివేయాలి. నేను ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచా. ప్రస్తుతం వాటిని నేరవేర్చలేకపోతున్నా. నా పంచాయతీలో తాగు నీటి కోసం బోర్లు వేయించా. ఆ బిల్లులను ఇంతవరకు ఇవ్వలేదు’’ అని సర్పంచ్‌ సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-15T03:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising