ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్‌లో తెలుగు మహిళల సమస్యలపై చర్చ

ABN, First Publish Date - 2022-09-02T08:42:49+05:30

గల్ఫ్‌లో పెద్ద దేశమైన సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ర్టాల మహిళల సమస్యలపై రియాద్‌లోని భారత దౌత్య కార్యాలయం (ఎంబసీ) తొలిసారి ఒక తెలుగు ప్రవాస మహిళా నేతతో చర్చించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరానికి చెందిన మహిళా నేతతో తొలిసారి చర్చించిన రియాద్‌లోని భారత ఎంబసీ


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

గల్ఫ్‌లో పెద్ద దేశమైన సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ర్టాల మహిళల సమస్యలపై రియాద్‌లోని భారత దౌత్య కార్యాలయం (ఎంబసీ) తొలిసారి ఒక తెలుగు ప్రవాస మహిళా నేతతో చర్చించింది. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు నిరీక్షించడంతో పాటు ప్రవాస మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై.. ప్రవాస మహిళా సామాజిక కార్యకర్త చాంద్‌ పర్వీన్‌తో భారత ఎంబసీ ఉన్నతాధికారి యస్‌.ఆర్‌.సజీవ్‌ గురువారం ఉదయం చర్చించారు. ఉపాధి కోసం వచ్చి మోసపోతున్న తెలుగు మహిళల సమస్యలను అరికట్టడానికి సమష్టిగా తీసుకోవల్సిన చర్యల గూర్చి ఈ సందర్భంగా చర్చించామని అమె తెలిపారు. భీమవరం పాత బస్టాండ్‌ సమీపంలోని ఆర్‌.బి.బి వీధికి చెందిన పర్వీన్‌, సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘం ‘సాటా’ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అమె తండ్రి షేక్‌ అబ్దుల్‌ జబ్బార్‌ భీమవరంలో డిప్యూటీ డీఈవోగా పనిచేసి పదవి విరమణ పొందారు. 

Updated Date - 2022-09-02T08:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising