ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీంకోర్టులో ఐపీఎస్‌ అధికారి ఏబీవీకి అనుకూలంగా తీర్పు

ABN, First Publish Date - 2022-04-22T19:15:44+05:30

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు అనుకూలంగా సుప్రీం తీర్పును వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు అనుకూలంగా సుప్రీం తీర్పును వెల్లడించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. ఏబీవీ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సుప్రీం సమర్థించింది. రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తి అయినందున ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కొనసాగేది లేదని సుప్రీం స్పష్టం చేసింది. 1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ  ఉన్నతన్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు.  జస్టిస్ కన్విల్కర్ ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. 

Updated Date - 2022-04-22T19:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising