ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలపై చర్యలొద్దు : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ABN, First Publish Date - 2022-09-29T18:01:39+05:30

విద్యా హక్కు చట్టం (Right to Education Act) విషయంలో పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : విద్యా హక్కు చట్టం (Right to Education Act) విషయంలో పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు (Interim orders of the High Court) జారీ చేసింది. విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్ల కేటాయింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై యునైటెడ్ ప్రైవేట్ విద్యాసంస్థలు (United Private Educational Institutions) హైకోర్టును ఆశ్రయించాయి. విద్యాసంస్థల తరపున మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు .. విద్యాహక్కు చట్టానికి పూర్తి విరుద్ధమని శ్రీ విజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇచ్చిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (Standard Operating Procedure)‌కు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఈ ఉత్తర్వుల ద్వారా అనేక పాఠశాలలకు గుర్తింపు రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్ వేసిన వారి పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-09-29T18:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising