ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినూత్న ఆలోచనలే అభివృద్ధికి సోపానాలు

ABN, First Publish Date - 2022-06-26T08:40:27+05:30

వినూత్న ఆలోచనలే అభివృద్ధికి సోపానాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ ఇంజనీర్లకు షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌ పిలుపు

ఘనంగా ఆర్వీఆర్‌అండ్‌జేసీ 5వ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు

గుంటూరు (విద్య), జూన్‌ 25: నేటి తరం యువ ఇంజనీర్ల వినూత్న ఆలోచనలు సమాజాభివృద్ధ్దికి సోపానాలు కావాలని సతీ్‌షఽథవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌, శ్రీహరికోట) డైరెక్టర్‌ ఎ.రాజరాజన్‌ ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్వీఆర్‌అండ్‌జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన 5వ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి కళాశాల అధ్యక్షులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజరాజన్‌ మాట్లాడుతూ.. డిగ్రీ పుచ్చుకుని నిజ జీవితంలోకి అడుగు పెడుతున్నయువ ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఎంచుకున్న రంగంలో నిత్య విద్యార్థిగా ముందుకు సాగాలని సూచించారు. ఉద్యోగాలు సృష్టించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని కోరారు. దేశానికి తమ సేవల ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పంచిన విక్రమ్‌ సారాభాయ్‌, సతీ్‌షఽథావన్‌, అబ్దుల్‌కలామ్‌ వంటి వారి స్ఫూర్తితో రాణించాలన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రాజశేఖర్‌ ప్రసంగిస్తూ.. కృషి పట్టుదలతో విద్యను విజయవంతంగా పూర్తిచేసి విద్యార్థులు నిజ జీవితంలోఅదే స్ఫూర్తితో రాణించాన్నారు. నైతిక విలువలు, నిజాయితీతో కూడి జీవనాన్ని అలవాటు చేసుకోవాలని కళాశాల అధ్యక్షులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ సూచించారు. ఈ సందర్బంగా 2022 విద్యాసంవత్సరంలో బిటెక్‌ పూర్తిచేసుకున్న 800 మందికి డిగ్రీ పట్టాలు, చదువులో ప్రతిభ చూపిన వారికి గోల్డ్‌మెడల్స్‌ అందజేశారు. 

Updated Date - 2022-06-26T08:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising