ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ

ABN, First Publish Date - 2022-07-12T02:21:20+05:30

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని అర్చకులు ఆకుకూరలతో శాకాంబరిగా అలంకరించారు. విఘ్నేశ్వరపూజ, హోమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. తొలిరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ శాకాంబరీ ఉత్సవాలు బుధవారంతో ముగుస్తాయి. 


ఘాట్‌రోడ్ మూసివేత

వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రిపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. వర్షాలు తగ్గే వరకు ఘాట్‌ రోడ్డును మూసివేస్తున్నట్టు అధికారులు బోర్డులు ఏర్పాటు చేయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు మెట్ల మార్గంలో గానీ, లిఫ్టు మార్గంలో గానీ కొండపైకి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-12T02:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising