ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాలు.. కొత్త బాదుడు!

ABN, First Publish Date - 2022-04-05T09:07:35+05:30

పరిపాలన వికేంద్రీకరణకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్న జగన్‌ ప్రభుత్వం.. తొలి కానుకగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచేసింది. నూతన జిల్లాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కేంద్రాల చుట్టూ రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు

పెంపుదల రేపటి నుంచే అమల్లోకి

15 శాతం నుంచి 75శాతం వరకు పెంపు

సగటున 20 శాతంపైనే భారం

జిల్లా కేంద్రాలు, ఆనుకుని ఉండే

శివారు/గ్రామీణ ప్రాంతాల్లోనే పెంపు

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు

పాత జిల్లాల్లో ఆగస్టులో పెరిగే చాన్సు


అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్న జగన్‌ ప్రభుత్వం.. తొలి కానుకగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచేసింది. నూతన జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచేసి తద్వారా చార్జీల బాదుడుకు మార్గం సుగమం చేసుకుంది. ఒక్కో చోట 15 శాతం నుంచి 75 శాతం వరకు ఈ పెంపు ఉంది. పలు చోట్ల 50 శాతం నుంచి 75 శాతం వరకు పెంచడం గమనార్హం. మొత్తంగా సగటున 20 శాతంపైనే రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన రిజిస్ట్రేషన్‌ విలువలు బుధవారం (6వ తేదీ) నుంచే అమల్లోకి రానున్నాయి.  కొత్త జిల్లాల ప్రధాన కేంద్రాలు, చుట్టుపక్కల శివారు ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ విలువల పెంపును వర్తింపచేయాలంటూ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో బుధవారం నుంచి స్థలాలు, భవనాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, అదేవిధంగా వాటి తనఖా రిజిస్ట్రేషన్లు, భాగస్వామ్య పంపకాలు, ఆస్తుల అభివృద్ధి ఒప్పందాలు, లే అవుట్లు, భవనాల డెవల్‌పమెంట్‌ ఒప్పందాలు.. ఇలా అన్నింటి రిజిస్ట్రేషన్‌ చార్జీలూ పెరిగిపోనున్నాయి. వాస్తవానికి ఈ విలువల పెంపు కసరత్తు నెల రోజుల క్రితమే పూర్తయింది. అయితే కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగానే.. అమల్లోకి తేవాలనుకున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినా.. రెండ్రోజుల పాటు పెంచిన రిజిస్ట్రేషన్‌ విలువలను ఆన్‌లైన్‌లో పెట్టి.. 6వ తేదీ నుంచి అమలుచేయాలని నిర్దేశించారు.


ఈ చార్జీల పెంపుదల ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉండనుంది. జిల్లా కేంద్రాలు, పక్కనున్న శివారు ప్రాంతాలు, ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ర్టార్లు ఎక్కడికక్కడ విలువలు ఎంత పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు తయారుచేశారు. దానిపై జేసీ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి, అక్కడ వాస్తవ మార్కెట్‌ విలువలు తదితరాలను దృష్టిలో పెట్టుకోవడం వల్ల పెంపు అంతటా ఏకరీతిగా ఉండదు. అయితే కొత్త జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల సహజంగానే అధికంగా విలువలు పెంచారు. మరికొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాల లెక్కన ఉన్న భూములకు కూడా బాగానే విలువలు పెంచారు. 


ఒక్కో జిల్లాల్లో ఒక్కో రకంగా..

రిజిస్ట్రేషన్‌ చార్జీలను కొత్త జిల్లాల్లో మొత్తానికి మొత్తం పెంచలేదు. జిల్లా కేంద్రాలు, వాటిని ఆనుకుని ఉన్న సబర్బన్‌/గ్రామీణ మండలాల్లో మాత్రమే పెంచాలని నిర్ణయించారు. ఉదాహరణకు ఎన్టీఆర్‌ జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లా విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడింది. దీనిలో అధికభాగం విజయవాడ నగరం, దాని శివారు ప్రాంతాలున్నాయి. అంటే ఈ జిల్లాలో ఎక్కువ భాగానికి రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు వర్తిస్తుంది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను తీసుకుంటే.. ఆ జిల్లా కేంద్రం పార్వతీపురానికి దూరంగా అనేక మండలాలు, ప్రాంతాలున్నాయి. ఆయా చోట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు వర్తించదు. అంటే ఆయా జిల్లాల్లో రిజిస్ర్టేషన్ల విలువలు వర్తించే ప్రాంతం కాస్త తక్కువగా ఉంటుంది. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపునకు కసరత్తు పూర్తిచేసేశారు. ఎంతెంత పెంచాలో కూడా ఖరారుచేశారు. అయితే ప్రస్తుతానికి కొత్త జిల్లాల వరకే పెంచాలని నిర్ణయించడంతో.. మిగతా జిల్లాల్లో కూడా పెంపు ఉంటుందా.. ఉంటే ఎప్పుడు ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ చార్జీల విలువలను ఏటా ఆగస్టులో పెంచుతుంటారు. ఈసారి కూడా మిగిలిన 13 జిల్లాల్లో వచ్చే ఆగస్టు నెల నుంచి పెంచవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. 

Updated Date - 2022-04-05T09:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising