పోలవరంపై నేడు కీలక భేటీ
ABN, First Publish Date - 2022-10-07T08:23:39+05:30
పోలవరంపై నేడు కీలక భేటీ
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల సీఎ్‌సలు, ఉన్నతాధికారులతో కేంద్రం శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర సాంకేతిక సలహాదారులు కూడా పాల్గొంటారు.
Updated Date - 2022-10-07T08:23:39+05:30 IST