ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇంపాక్ట్ ఫీజు రద్దు చేయాలి: సీహెచ్ బాబురావు

ABN, First Publish Date - 2022-08-13T00:31:28+05:30

Amaravathi: ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబురావు (Babu Rao) జగన్ సర్కారు (CM Jagan)పై విమర్శలు చేశారు. మౌలిక సదుపాయాలు సమకూర్చడం విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు (Taxes) మోపటంలో ఆరితేరిందని వ్యాఖ్యానించారు. ప్రజల నెత్తిన అదనపు భారంగా మారిన ఇంపాక్ట్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పన్నుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబురావు (Babu Rao) జగన్ సర్కారు (CM Jagan)పై విమర్శలు చేశారు. మౌలిక సదుపాయాలు సమకూర్చడం విస్మరించిన  రాష్ట్ర ప్రభుత్వం పన్నులు (Taxes) మోపటంలో ఆరితేరిందని వ్యాఖ్యానించారు. ప్రజల నెత్తిన అదనపు భారంగా మారిన ఇంపాక్ట్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  పన్నుల భారాన్ని తిప్పి కొట్టడంలో పౌర సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు.


‘‘కేంద్ర ప్రభుత్వం (Central Govt.) పట్టణ సంస్కరణల పేరుతో ప్రజల నుంచి రకరకాల పన్నుల వసూళ్లకు రంగం సిద్ధం చేసింది.  ప్రతి పనికి రేటు కట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలకు లొంగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. అడ్డదారుల్లో ప్రజలను పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తుంది. కేంద్రం ఆదేశాల వల్ల రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర  పంచాయతీలలో ఉన్న ప్రజలపై అదనపు భారం పడుతుంది. అంతేకాకుండా CRDA,VMRDA, 16 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాలు అన్నిటిపైనా దీని ప్రభావం ఉంటుంది.’’ అని బాబు రావు తెలిపారు.

Updated Date - 2022-08-13T00:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising