ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-03-12T00:46:41+05:30

కర్నూలు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: కర్నూలు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. నంద్యాల పట్టణం విశ్వనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం మెనూలో పొంగలి, సాంబారు, కోడిగుడ్లను 91 మంది విద్యార్థులు తిన్నారు. కాసేపటికే విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో స్థానికులు 42 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స అందించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాఠశాలలోని ఇతర విద్యార్థులను కూడా పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. కోడిగుడ్లు మూడు వారాల క్రితం పాఠశాలకు సరఫరా అయ్యాయని, ఎండాకాలం కావడంతో లోపల పాడై ఉండవచ్చని భావిస్తున్నారు. పొంగలి, సాంబారు, కోడిగుడ్లను పరిశీలించేందుకు కర్నూలులోని ల్యాబ్‌కు పంపారు.

Updated Date - 2022-03-12T00:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising