ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో లేస్తే అప్పు... పడుకొంటే అప్పు

ABN, First Publish Date - 2022-08-04T08:01:27+05:30

రాష్ట్రంలో లేస్తే అప్పు... పడుకొంటే అప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెచ్చిన ప్రతి రూపాయికీ లెక్క చూపించాలి: జీవీ రెడ్డి 

అమరావతి, ఆగస్ట్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో లేస్తే అప్పు.. పడుకొంటే అప్పు. ప్రభుత్వం ఏం చేస్తోందయ్యా అంటే ఏడాదిలో ప్రతిరోజూ అప్పుల కోసం తిరగడం ఒక్కటే కనిపిస్తోంది. ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటే అప్పు కోసమే అని స్కూలుకెళ్లే పిల్లలకు కూడా తెలిసిపోయింది’ అని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పు దొరికితే ప్రభుత్వం నడిపించడం లేకపోతే పడుకోవడం అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ‘‘ఆర్థిక సంవత్సరం మొదలై నాలుగు నెలలైంది. ఈ నాలుగు నెలల్లో దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ.20వేల కోట్లకు మించి అప్పు చేయలేదు. మన రాష్ట్రం మాత్రం రూ.40వేల కోట్లకు పైగా అప్పు చేసింది. ఇదిగాక కేంద్రం, విదేశీ రుణ ప్రాజెక్టుల నుంచి మరికొంత అప్పు వస్తుంది. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెస్తోంది. వాటి వివరాలు కేంద్రానికి ఇవ్వడం లేదు. కాగ్‌ అడిగినా ఇవ్వడం లేదు. రిజర్వు బ్యాంకు ద్వారా అధికారికంగా తెచ్చుకొంటున్న అప్పుల్లోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది’ అని అన్నారు. ఇన్ని అప్పులు తెచ్చి వాటిని ఏం చేస్తున్నారన్నది పెద్ద మిస్టరీగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి రూపాయికీ లెక్క చూపిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-08-04T08:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising