ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతగాకపోతే గద్దె దిగండి

ABN, First Publish Date - 2022-05-28T08:04:51+05:30

చేతగాకపోతే గద్దె దిగండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యాచార ఘటనలపై చర్చలో చంద్రబాబు మండిపాటు

చెల్లికే న్యాయం చేయలేనివాడు ఎవరికి చేస్తాడు: అనిత


ఒంగోలు, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘చేతనైతే ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరగకుండా ఆపండి. వారికి రక్షణ కల్పించండి. చేతగాకపోతే గద్దె దిగి తప్పుకోండి. అవి ఎలా ఆగవో మేం చూస్తాం. దమ్ముంటే సమాధానం చెప్పండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. మహిళలపై అత్యాచార ఘటనలపై జరిగిన మహానాడులో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పాలన చేత గాని దద్దమ్మలు, అసమర్థుల వల్ల రాష్ట్రంలో మహిళలు పలు అగచాట్లు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. బయటకు వెళ్లడానికే వారు భయపడాల్సి వస్తోందన్నారు.


సీఎం ఇంటి సమీపంలో జరిగితే..

తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తిరుగుతున్న తన చెల్లి సునీతకే న్యాయం చేయలేని జగన్‌రెడ్డి ఈ రాష్ట్రంలో మరే మహిళకు న్యాయం చేస్తారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో అత్యాచారం జరిగితే 11 నెలలు గడిచినా ఈ రోజు వరకు నిందితుడు వెంకటరెడ్డిని పట్టుకోలేదు. ఇంట్లో మహిళల గురించి నీచంగా మాట్లాడి చంద్రబాబు కంట కన్నీరు పెట్టించారు. దానికి బదులు తీర్చుకుంటాం’ అని ప్రకటించారు.

Updated Date - 2022-05-28T08:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising