ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి, కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన సజ్జల

ABN, First Publish Date - 2022-04-29T23:06:03+05:30

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి, కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన సజ్జల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి, గుంటూరు: తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కేటీఆర్ అయినా ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలని, ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సజ్జల సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదని, సుమారు 50 - 60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉందని సజ్జల తెలిపారు. ఎపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారని, విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ది జరగలేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ది చెందిందని, హైదరాబాద్‌లో పీవీ ఎక్స్ ప్రెస్ వే వైఎస్ హయాంలో చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ మనకూ అందరికీ తెలుసు అని, అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని, కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచు కోలేదని సజ్జల అన్నారు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవని, మొన్నటి వరకు తెలంగాణలోనూ విద్యుత్ కోతలున్నాయని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని, సీఎం జగన్ పాలనలో తన మార్కును చూపిస్తున్నారని సజ్జల అన్నారు.


దిశ చట్టం తెచ్చిన స్పూర్తితో యువతిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దిశ చట్టంపై చేస్తున్నవన్నీ రాజకీయ విమర్శలే అని, దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న వారికి తీర్పు చెంపపెట్టు లాంటిదని ఆయన తెలిపారు.

Updated Date - 2022-04-29T23:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising