ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ కూలికెళ్లే... కాడి ఊయలయ్యే..!

ABN, First Publish Date - 2022-07-06T08:46:22+05:30

భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే గానీ నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లని దుస్థితి ఆ కుటుంబానిది. అందుకే ఆ ఇల్లాలు బిడ్డను భర్త వద్ద వదిలి కూలి పనులకు వె ళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోనెగండ్ల: భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే గానీ నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లని దుస్థితి ఆ కుటుంబానిది. అందుకే ఆ ఇల్లాలు బిడ్డను భర్త వద్ద వదిలి కూలి పనులకు వె ళ్లింది. ఆ తండ్రి.. గుంటెకకు(కాడి) ఊయల కట్టి... అందులో బిడ్డను పడుకోబెట్టి పొలం దున్నే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్‌.కైరవాడలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మన్న, ఈరమ్మ దంపతులకు రెండేళ్ల పాప ఉంది. వీరికి రెండెకరాల పొలం ఉంది. ఈ ఏడాది అప్పుచేసి పత్తి పంటను సాగు చేశాడు. పత్తి మొలకెత్తిన నాటి నుంచి నేటి వరకు వర్షం జాడలేదు.


పంటకు ఎర్రదిమ్మ తెగులు సొకింది. దీనికి తోడు కలుపు కూడా పెరిగింది. జీవనోపాధి ఇబ్బంది కావడంతో ఈరమ్మ తన బిడ్డను లక్ష్మన్న దగ్గర వదిలి కూలీ పనులకు వెళ్లింది. ఇంట్లో పాపను లాలించేవారు లేక కాడికి ఊయల వేసి.. అందులో బిడ్డను పడుకోబెట్టి పొలం దున్నే పని పూర్తి చేశాడు.

Updated Date - 2022-07-06T08:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising