ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వక్ఫ్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2022-02-23T08:21:21+05:30

వక్ఫ్‌ బోర్డు సభ్యు ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సభ్యుల నియామకాలపై కౌంటర్‌ దాఖలుకు ఆదేశం


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డు సభ్యు ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మైనార్టీ సంక్షేమశాఖ ము ఖ్యకార్యదర్శి, వక్ఫ్‌బోర్డు సీఈవో అలీం బాషా, 8 మంది సభ్యులు, సీబీఐ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ మహ్మద్‌ ఈ పిల్‌ వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాజారెడ్డి కోనేటి వాదనలు వినిపిస్తూ...వక్ఫ్‌ చట్టంలో సెక్షన్‌ 14 ప్రకారం సభ్యుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యులకు వక్ఫ్‌ చట్టానికి అనుగుణంగా తగిన అర్హతలు లేవన్నారు.  

Updated Date - 2022-02-23T08:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising