వర్షం జోరు!
ABN, First Publish Date - 2022-10-08T05:14:23+05:30
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చిరుజల్లులు పడుతునే ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి పట్టణాలు వర్షంతో అస్తవ్యస్తంగా మారాయి. భోగాపురం మండలం ముక్కాం తీర గ్రామం కోతకు గురైంది. సంద్రంలో అలలు
కోతకు గురైన ముక్కాం తీరం
100 మీటర్లు ముందుకొచ్చిన సంద్రం
గుర్ల గెడ్డ ఉధృతికి కొట్టుకుపోయిన కల్వర్టు
విజయనగరం(ఆంధ్రజ్యోతి)/భోగాపురం/మెంటాడ, అక్టోబరు :జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చిరుజల్లులు పడుతునే ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి పట్టణాలు వర్షంతో అస్తవ్యస్తంగా మారాయి. భోగాపురం మండలం ముక్కాం తీర గ్రామం కోతకు గురైంది. సంద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి సముద్రం 100 అడుగుల మేర ముందుకొచ్చింది. రహదారి పూర్తిగా కోతకు గురైంది. తీరంలో మత్స్యకారులు ఏర్పాటుచేసుకున్న షెడ్లు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. తహసీల్దారు శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించారు. మెంటాడ మండలం ఆగూరు వద్ద గుర్ల గెడ్డ పొంగి ప్రవహించడంతో కల్వర్టు కోతకు గురైంది. ఆరు నెలల కిందటే కల్వర్టును నిర్మించారు. ఇంతలోనే కొట్టుకుపోయింది. వర్షాలకు ఇళ్లు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజాంలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ప్రధాన రహదారుల్లో గోతుల్లో నీరు చేరి వాహన చోదకులు అసౌకర్యానికి గురయ్యారు.
Updated Date - 2022-10-08T05:14:23+05:30 IST