ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిక్కోలులో భారీ వర్షం

ABN, First Publish Date - 2022-03-22T01:59:45+05:30

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సిక్కోలు జిల్లాలో భారీవర్షం కురిసింది. రాజాం, పాతపట్నం, మెళియాపుట్టి, సీతంపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సిక్కోలు జిల్లాలో భారీవర్షం కురిసింది. రాజాం, పాతపట్నం, మెళియాపుట్టి, సీతంపేట ప్రాంతాల్లో గాలీవాన బీభత్సం సృష్టించాయి. అత్యధికంగా రాజాంలో 26.25 మి.మీ, పాలకొండలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకొంది. రాజాంలోని బొబ్బిలి కూడలిలో విద్యుత్‌ స్తంభంతో పాటు భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ఓ ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతింది. పెనుబాక గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డుకు ఆనుకుని విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. పాలకొండ-శ్రీకాకుళం-చీపురుపల్లి రోడ్డులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మెకానిక్‌ రేకుషెడ్‌లు గాలికి ఎగిరిపోయాయి. హోర్డింగ్‌లు నేలకొరిగాయి. మెళియాపుట్టి మండలం వసుంధరలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. వసుంధర గ్రామానికి చెందిన మోహన్‌ కుంటియా పెరటిలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడగా.. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. 

Updated Date - 2022-03-22T01:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising