ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమలో భారీ వర్షం

ABN, First Publish Date - 2022-05-19T08:33:31+05:30

ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, మరట్వాడ, కర్ణాటక మీదుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరులో 113.2 మి.మీ. వాన

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

బొమ్మనహాళ్‌లో రామాలయ గోపురంపై పిడుగు 


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), అనంతపురం అర్బన్‌, మే 18:  ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, మరట్వాడ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బుధవారం రాయలసీమలో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. సీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 113.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖరీప్‌ సీజన్‌ ఆరంభానికి ముందే భారీ వర్షం పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తడి ఆరగానే దుక్కి దున్నేందుకు సిద్ధమవుతున్నారు.


పొంగిపొర్లిన వాగులు, వంకలు..

పెనుకొండలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటలకు నీరు చేరింది. రొద్దం మండలం ఆర్‌.మరువపల్లిలోని చిన్నవంక, పెద్దవంక నుంచి పెన్నానదిలోకి అధికంగా వర్షం నీరు చేరింది. రొద్దకంపల్లి, గౌరాజుపల్లి, నారనాగేపల్లి ప్రాంతాల్లో పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. తాడంగిపల్లి వద్ద తాడంక పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మడకశిర పరిధిలోని వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండాయి. యల్లోటి, మడకశిర, వైబీ హళ్ళి, గుండుమల, హరేసముద్రం చెరువులకు నీరుచేరింది. జమ్మానిపల్లిలో వంక నీరంతా కర్ణాటక వైపు పారుతోంది. ఇక్కడ చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులను కోరినా, పంటించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మనహాళ్‌ మండల కేంద్రంలోని రామాలయ గోపురంపై పిడుగు పడింది. గోపురంపై చెక్కిన శిల్పాలు ధ్వంసమయ్యాయి. ఆలయ సమీపంలోని 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి కణేకల్లు మండలం ఉడేగోళంలో ఓ ఇల్లు నేలమట్టమైంది.  


నీట మునిగిన పంటలు 

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్‌, హరేసముద్రం, ఉద్దేహాళ్‌, శ్రీధరఘట్ట, సింగానహళ్లి తదితర గ్రామాల్లో వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. రొద్దం మండలంలో పత్తిపంటలు నీట మునిగాయి. గుమ్మఘట్ట మండలంలో వేరుశనగ పంట దెబ్బతింది. ఇక ఈదురుగాలులతో కూడిన వర్షానికి రంగసముద్రంలో అరటి తోటలు నేలకొరిగాయి. ఆత్మకూరులో టమోటా పంట నీటమునిగింది. కణేకల్లు పరిధిలోని వేదవతి, హగరి నదులు పొంగి పొర్లుతుండటంతో పరిసర ప్రాంతాల్లో సాగు చేసిన పలు రకాల పంటలు నీట మునిగాయి. 


నేడూ వర్షాలు: రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.  నైరుతి రుతుపవనాలు బుధవారం అండమాన్‌, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రం మొత్తం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.  

Updated Date - 2022-05-19T08:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising