ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

rain: కోస్తాకు భారీ వర్షసూచన

ABN, First Publish Date - 2022-10-04T02:38:39+05:30

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వున్న ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వున్న ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం కోస్తాంధ్ర తీరం దిశగా రానున్నది. వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు (heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. సోమవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు అటుఇటుగా నమోదయ్యాయి. కావలిలో 34.4 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-10-04T02:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising